లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి వేడుకలు
26-08-2026 05:54 PM
నేరేడుచర్ల, ఆగస్టు 26(విజయ క్రాంతి): లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో సేవామూర్తి, మానవతావాది భారతరత్న మదర్ తెరిసా జయంతి కార్యక్రమం స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ బట్టు మధు మాట్లాడుతూ.. మదర్ థెరిసా నిస్వార్థ సేవలను కొనియాడారు. అభాగ్యులు, నిరుపేదలు, అనాథలకు ఆమె అందించిన సేవలు మానవాళికి స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు షేక్ యూసుఫ్, క్లబ్ ప్రధాన కార్యదర్శి సరికొప్పుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు గుండా సత్యనారాయణ, బాల వెంకటేశ్వర్లు, జీఎంటి కోఆర్డినేటర్ లాయర్ విశ్వనాథం,సీనియర్ సభ్యులు గంధం శావయ్య మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మదర్ తెరిసాకు ఘన నివాళులు అర్పించారు






