16 April, 2026 | 10:43 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

02-02-2026 11:27 AM

చారకొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి చైతన్య ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్న వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామానికి చెందిన మహేష్ (23), తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన బన్నీ (23), జంగారెడ్డిపల్లి గ్రామానికి రాజ్ కుమార్ ముగ్గురు ద్విచక్ర వాహనంపై మండలంలోని సారగట్ల మైసమ్మ దేవాలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో కల్వకుర్తికి వెళుతుండగా తిమ్మాయిపల్లి సమీపంలో రహదారి పక్కన నిలిపిన జేసిబిని కల్వకుర్తి వైపు నుంచి చారకొండ వైపుకు వెళ్తున్న డీసీఎం ఓవర్ టెక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి డీసీఎంను ఢీకొట్టి జెసిబి కిందికి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మహేష్, బన్నీ లు ఇద్దరు మృతి చెందగా రాజ్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.