calender_icon.png 18 February, 2026 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి సమస్య నివారణకు చేతి పంపులో మోటార్ ఏర్పాటు

18-02-2026 07:53:22 PM

పెంచికల్పేట,(విజయక్రాంతి): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా పెంచికల్పేట గ్రామ పంచాయతీలో చర్యలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కసిపాక సత్యం ఇంటి ముందు ఉన్న చేతి పంపులో సర్పంచ్ షేక్ ఉస్మాన్ మోటార్ ఏర్పాటు చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధే లక్ష్యంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నాయకులు, ఎమ్మెల్యే దండే విట్టల్ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.