calender_icon.png 18 February, 2026 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తింపు కార్డు కొరకు రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలి

18-02-2026 07:57:30 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రతి రైతు నుండి రైతు గుర్తింపు కార్డు కొరకు దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతువేదికలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి తో కలిసి మండల వ్యవసాయ శాఖ, మండల వ్యవసాయ విస్తరణ శాఖ అధికారులతో రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్, యాప్ ద్వారా యూరియా ఫ్లాట్ బుకింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రైతు గుర్తింపు రిజిస్ట్రేషన్ కొరకు ప్రతి ఒక్క రైతు దరఖాస్తు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని, ఫార్మర్ ఐడి ద్వారా ప్రభుత్వ పథకాలు, రాయితీ యంత్రాలు, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు, ఇతర ప్రయోజనాలు కలుగుతాయని, ఆ దిశగా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ పద్ధతి ద్వారా రైతులు ఎరువుల కోసం స్లాట్ బుకింగ్ చేసుకునేలా ప్రతి రైతుకు తెలియజేయాలని అన్నారు.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రైతు భూమి వివరాలు, ఆధార్ కార్డు నకల్ ప్రతి, మొబైల్ నెంబర్ లు తీసుకోవాలని, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆయిల్ పామ్, కూరగాయల సాగు వైపు ప్రోత్సహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు మనోహర్,  మిలింద్, వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.