చెట్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
10-11-2025 08:55 PM
మంథని (విజయక్రాంతి): చెట్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన మంథని మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మంథని కాటారం ప్రధాన రహదారి వెంకటాపూర్ క్రాస్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మంచిర్యాల జిల్లాకు చెందిన తాళ్లూరి సాయి శ్రావణ్ కుమార్ ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పడంతో చెట్టును ఢీకొన్నాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సింగరేణిలో ఇటీవలనే ట్రైనింగ్ లో ఉన్నాడని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.




