9 May, 2026 | 5:34 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

మన కథే అనిపించేలా విత్ లవ్

31-01-2026 01:28 AM

అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విత్ లవ్’. మదన్ రచన, దర్శకత్వం వహించారు. సౌందర్య రజనీకాంత్, నజరత్ పసిలియన్, మహేశ్‌రాజ్ పసిలియన్ నిర్మించారు. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘ఈ మూవీ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఇది మన కథే అనిపిస్తోంద’న్నారు. హీరో అభిషన్ జీవింత్ మాట్లాడుతూ.. “విత్ లవ్’ అద్భుతమైన భావోద్వేగాలున్న సినిమా.

మన జ్ఞాపకాలని నెమరు వేసుకునేలా ఉంటుంది” అన్నారు. ‘చాలా క్యూట్ సినిమా. తప్పకుండా అందరినీ అలరిస్తుంద’ని అనస్వర  చెప్పారు.  సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను తెలుగులోకి తీసుకురావడం చాలా ఆనం దంగా ఉంది. రానా చైల్డ్‌వుడ్ ఫ్రెండ్. తనతో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలున్నాయి. ఈ సినిమా ఆయన రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది” అని తెలిపారు. ‘ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాన’ని ప్రొడ్యూసర్ మహేశ్‌రాజ్ చెప్పారు.