చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు
శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
చర్ల,(విజయక్రాంతి): మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం చర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు అంబరాన్నంటాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు గా టీపిసీసీ జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి కృష్ణ పాల్గొన్నారు.
నాయకులు ఎంపీ చిత్రపటం వద్ద కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నల్లపు దుర్గాప్రసాద్, డీసీసీ ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీ బలరాం నాయక్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.






