ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కు సహకరించాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా శ్రీ రామ్ నగర్ కాలనీ 40 వ వార్డులో వార్డు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వార్డు సభలు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు వేదికలుగా నిలుస్తున్నాయన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజాసేవలా మెరుగుదల సాధ్యమవుతుందన్నా ప్రతి కుటుంబం చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరుచేసి మున్సిపాలిటీ కి అందించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. దోమల వ్యాప్తి నరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అంటూ వ్యాధుల నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
విద్యుత్ లో పొదుపుగా సురక్షితంగా వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా పోలీసు అధికారులు సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అపరిచిత లింకులు ఫోన్ కాల్స్ ఓటిపి వివరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదన కలెక్టర్ ఎన్ వై గిరి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, తాసిల్దార్ హిమబిందు, హౌసింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.






