పాట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ కామేశ్వరరావు
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
రాజ్యాంగ పరమైన ప్రక్రియ పూర్తిగా కాగానే బాధ్యతలు
పాట్నా, ఆగస్టు ౯: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.కామేశ్వరరావును పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు ౬న జరిగిన కొలీజియం భేటీలో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుధీర్ సింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన సీజేగా జస్టిస్ వి.కామేశ్వరరావు బాధ్యతలు స్వీకరిస్తారు. జస్టిస్ కామేశ్వరరావు 1965 ఆగస్టు 7న జన్మించారు. ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ (ఆనర్స్), ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1991 మార్చిలో ఢిల్లీ బార్ కౌ న్సిల్‌లో అడ్వొకేట్‌గా నమోదయ్యారు. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌లో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. మద్రాస్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు పోర్ట్ బ్లేయర్ సర్క్యూట్ బెంచ్ ముందుకు కూడా వివిధ కేసుల్లో హాజరయ్యారు.
సర్వీస్, లేబర్, ఆర్బిట్రేషన్, రాజ్యాంగ, పరిపాలనా చట్టాలకు సంబంధించిన కేసులను ఆయన బలంగా వాదించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా వ్యవహరించారు. 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఆయన్ను సీనియర్ అడ్వొకేట్‌గా గుర్తించింది. 2013 ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2015 మార్చిలో శాశ్వత న్యాయమూ టర్తి అయ్యారు. ఈ క్రమంలో 2024లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. జూలై 2025లో తిరిగి ఢిల్లీ హై కోర్టుకు వచ్చారు. మరోవైపు, జస్టిస్ కామేశ్వరరావు ఢిల్లీ హైకోర్టును వీడుతుండటంపై సీనియర్ అడ్వొకేట్ సంజయ్ ఘోష్ స్పందించా రు. న్యాయస్థానం ఒక వినయ విధేయతలు గలిగిన న్యాయమూర్తిని కోల్పోయిందని ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అలాగే, జస్టిస్ కామేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు.






