calender_icon.png 12 May, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే సమస్యలపై జీఎంతో ఎంపీ చామల భేటీ

24-04-2025 01:31:08 AM

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి):  భువనగిరి పార్లమెంట్ పరిధిలోని రైల్వే సమస్యల పైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రైల్వే జీ ఎం తో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుండి రాయగిరి(యాదగిరిగుట్ట)వరకు ఎంఎంటిఎస్  రైలు కొసం  కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పిస్తామన్నారు. తెలంగాణ తిరుపతి ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు, హైదరాబాద్  కు అప్ అండ్ డౌన్ చేసే కార్మికులకు  ఎంఎంటీఎస్ రైల్ ఉపయోగపడుతుందన్నారు. 

భువనగిరి, ఆలేరు, జనగాం, రామన్నపేటలో*, పనులు రైళ్ల రాకపోకల సమయాలు మార్పు ,భువనగిరి జిల్లా కేంద్రం లో తిరుపతి వెళ్ళడానికి పద్మావతి ఎక్సప్రెస్ ఆపుట మరియు అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణాల కోసం ఇటీవలే పార్లమెంట్లో ప్రస్తావించిన పలు అంశాలు మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కలిసి విషయాలపై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారితో కులంకశంగా ఎంపీ చర్చించారు.   పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మేమరండం ఇచ్చారు. జి ఎంతో సమావేశం అయిన వారిలో ఖమ్మం ఎంపీ శ్రీ రఘురాం రెడ్డి, వరంగల్ ఎంపీ శ్రీ డాక్టర్ కడియం కావ్య ఉన్నారు..