calender_icon.png 15 May, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడారంగంలో యువత ముందుండాలి

24-04-2025 01:30:48 AM

ధనరాజ్ స్మారక జిల్లా స్థాయి కార్క్ బాల్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు 

 గూడూరు. ఏప్రిల్ 23: (విజయ క్రాంతి): క్రీడారంగంలో యువత ముందుండాలని ఏపూర్ రవీందర్ రెడ్డి సొసైటీ చైర్మన్ చల్లాలింగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి మాజీ ఎంపీపీ చిలుకూరి వెంకన్న అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ మాజీ గూడూరు సర్పంచ్ నునావత్ రమేష్ నాయక్ కుమారుడు ధన్ రాజ్ స్మారక జిల్లా స్థాయి కార్క్ బాల్ క్రికెట్ పోటీల ప్రారంభ కార్యక్రమం రమేష్ నాయక్ అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ క్రీడారంగంలో యువత ముందుండి గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నుండి దేశవాళి క్రికెట్ ఆడే విధంగా ఎదగాలని అన్నారు.

నేటి సమాజంలో క్రీడలు ఎంతో ప్రాముఖ్యత  సంతరించ కుంటున్నాయని దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని యువకులు చెడు మార్గంలో ప్రయాణించకుండా సరైన మార్గంలో ప్రయాణించడానికి దోహదపడుతున్నాయని అన్నారు. ప్రతిభను వెలికి తీసి సంకల్పంతో ధనరాజును స్మరించుకుంటూ అతని స్మారకంగా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు క్రీడాకారులను వెలికి తీయుటకు ఈ ప్రయత్నం జరుగుతుందని ఈ సందర్భంగా రమేష్ నాయక్ ను వారు అభినందించారు కాగా ఈ పోటీలు మొదటి బహుమతి 30 వేల 116 తో పాటు ట్రోఫీ అందజేయడం జరుగుతుందని అదేవిధంగా ద్వితీయ బహుమతి ట్రోఫీ 20,116  తృతీయ బహుమతి 10116 ట్రోఫీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు బాగా ఈ క్రీడలు గూడూరు ఎమ్మార్వో ఆఫీస్ వెనుక మైదానంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.