కన్హా శాంతి వనంలో విశ్వ మాంగళ్య సభకు హాజరైన ఎంపి డీకే అరుణ
04-04-2026 06:15 PM
షాద్ నగర్,(విజయక్రాంతి): కన్హా శాంతివనంలో మూడురోజుల పాటు జరిగే విశ్వ మాంగళ్య సభకు ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతి వనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో తల్లి పాత్ర, సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఇంచార్జ్ అందే బాబయ్య, స్టేట్ కౌన్సిల్ సభ్యులు మనోహర్ రెడ్డి, పాలమూరు జిల్లా ప్రధానకార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కోశాధికారి నర్సింహ గౌడ్ తదితరులు హాజరయ్యారు.




