23 May, 2026 | 4:56 PM

బండ మాదారంలో శ్రీ పెద్దమ్మ తల్లి, బొడ్రాయి పండుగ ఉత్సవాలు

23-05-2026 04:18 PM

పాల్గొన్న బిజెపి ఎంపి ఈటల రాజేందర్

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారం 19వ మున్సిపల్ వార్డు పట్టణంలో శ్రీ పెద్దమ్మ తల్లి, బొడ్రాయి పండుగ మహోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి బిజెపి పార్లమెంట్ సభ్యులు మాజి మంత్రి వర్యులు (ఎంపి) ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బండమాదారం మున్సిపల్ పట్టణానికి విచ్చేసిన ఎంపికి బిజెపి మున్సిపల్ వైఎస్ చైర్ పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, స్థానిక బిజెపి నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.అనంతరం ఈటల రాజేందర్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండమాదారం మున్సిపల్ పట్టణం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతోసంతోషాలతో విలసిల్లాలని ఆయన అమ్మవార్లను ప్రార్థించారు.