చట్టాలపై అవగాహనే మహిళలకు రక్షణ
సీనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర
బంబారలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు సదస్సు
వాంకిడి,(విజయక్రాంతి): చట్టాలపై అవగాహన పెంచు కుంటేనే మహిళలకు పూర్తి రక్షణ లభిస్తుందని ఆసిఫాబా ద్ సీనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బంబార గ్రామపం చాయతీలో గ్రామ సర్పంచ్ బెండరే కృష్ణాజీ అధ్యక్షతన మహిళలకు ప్రత్యేక అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ .. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని అరికట్టే బాధ్యత సమాజంపై ఉందన్నారు.
వ్యభిచారం, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే సామాజిక, ఆరోగ్యపర మైన దుష్ప్రభావాలను ఆయ న వివరించారు. మహిళలు ఎలాంటి సమస్యలకైనా భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి చట్టపరమైన రక్షణ పొందాలని పిలుపుని చ్చారు. జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంతలక్ష్మి మాట్లాడుతూ.. గృహహింస, వరకట్న వేధింపు లు, ఆస్తి హక్కులపై మహిళలకు ఉన్న చట్టాలను వివరించారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధానాన్ని వివరించా రు.






