22-02-2026 12:13:32 AM
కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసులు
మేడ్చల్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించేందుకు సిద్ధమైన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను శనివారం పూడూరులోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రభుత్వ వైఖరిని, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. గుండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని అన్నారు.
అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని మేడ్చల్‌లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ శంకర్‌రెడ్డికి, ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాహనం దిగి రోడ్డుపై బైఠా యించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు వాహనాన్ని తెప్పించి అందులో బలవంతంగా ఎక్కించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ర్టం లో హిందువులపై దాడులు పెరిగాయని ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి ఆరోపించారు.