30 May, 2026 | 10:10 PM

Breaking News

వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •   పొగాకు ఆరోగ్యానికి హానికరం   •   అచ్చంపేట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు   •   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు   •   వరద సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించిన యూఎస్‌టీ సంస్థకు జిల్లా కలెక్టర్ ప్రశంస   •   రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి   •  

అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎంపీ ఈటల రాజేందర్

25-02-2026 01:05 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఉప్పల్ జోన్,  ఘట్ కేసర్ సర్కిల్ 6వ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి బైపాస్ రోడ్డు మైసమ్మగుట్ట వద్ద నిర్మిస్తున్న అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మంగళవారం సాయంత్రం నేషనల్ హైవే రోడ్ అథారిటీ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. మైసమ్మగుట్ట కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణoలో చిన్నపాటి మార్పులను సూచించి పనులు వేగవంతం చేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ కాంట్రాక్టర్ కి సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, మాజీ కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పర్యవేక్షించి చిన్నపాటి  మార్పులు చేసినందుకు ఘట్ కేసర్ ప్రజలు, మైసమ్మగుట్ట కాలనీవాసుల తరపున ఎంపీ ఈటల రాజేందర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.