సమాచారం ఇవ్వకుండానే పనుల కేటాయింపా..!
ఫ్లడ్ డ్యామేజ్ నిధుల పనులెవరూ చేశారూ..?
సభ్యలంటే కనీస మర్యాధ కరువు..
ప్రాధాన్యత లేదని అలిగి వెల్లిన ఆరో వార్డు కౌన్సిలర్
మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ల ఆవేదన
అధికారుల తీరుపై ఆగ్రహం.. వాడీవేడిగా చర్చ..
అచ్చంపేట, పిబ్రవరి 24: ‘మా వార్డు పరిధిలో అభివృద్ధి పనులు ఏమేమీ జరుగుతున్నాయో మాకు తెలియకుండానే పనులు కేటాయించినట్లు చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులైనా మేము ప్రజల అవసరాలు గుర్తించి పనులు చేపట్టాలని కోరినా ఎవరు పట్టించుకోవడం లేదు. కౌన్సిలర్లైన మాకు కనీస మర్యాద లేదు. ఎవరు అడగకున్నా.. ప్రాధాన్యత లేకున్నా నిధులు కేటాయించి పనులు చేస్తామని ఎజెండాలో చూపిస్తున్నారు.
ఇన్ని రోజుల నుంచి అడిగితే స్పందన లేదు. అధికార పార్టీలో ఉన్నా ఇదే పరిస్థితి. పట్టణంలో ఫ్లడ్ డ్యామేజీ పనులు వచ్చాయని చెబుతున్నారు. వాటిని ఎవరు ఎక్కడ చేశారో చెప్పాలని అడిగితే సమాధానం లేదు. ప్రజా సమస్యల గురించి సిబ్బందికి ఫోన్ చేస్తే ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఇటీవల మంత్రి పర్యటనలో సభ్యలకు సరైన సమాచారమే లేదు. ప్రజల ఆశీర్వాధంతో గెలిచిన కౌన్సిలర్లంటే ఇంత చులకనా.. ఇదేనా మీరు మాకిచ్చే కనీస గౌరవము’ అని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ఆసాంతం వాడీవేడిగా కొనసాగింది. ఒక దశలో సమావేశ మందిరం కౌన్సిలర్ల ఆవేదనతో దద్ధరిల్లింది. సభ్యలు నిలదీతతో అధికారులు ఉక్కరిబిక్కిరయ్యారు. ముందుగా అధికారులు ఎజెండా అంశాలను చదివి వినిపించారు. వాటిలో చాలా వాటికి కౌన్సిల్ సభ్యలకు తెలియకుండానే.. అవసరం లేకుండానే నమోదు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాధాన్యం లేని పనుల కేటాయింపు నిధులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
* నిధుల కేటాయింపులో వివక్ష తగదు
పట్టణంలో 20 వార్డుల పరిధిలో కేటాయించే నిధులు విషయంలో వివక్ష చూపించడం తగదని కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్డీఎప్, ఇతర ప్రత్యేక నిధులను కొన్ని వార్డులకు అసలు కేటాయించ లేదని ఆక్షేపించారు. రాబోయే నిధుల్లోనైనా అన్ని వార్డులకు సమ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. అధికార పార్టీకి చెందిన సభ్యడైనా తాను ఎన్నోసార్ల వార్డు పరిధిలోని సమస్యల పరిష్కారం.. పనులు చేపట్టాందేక నిధుల కేటాయింపు గురించి అడిగినా స్పందిండం లేదని.. కానీ కొంత మందికి అడగకుండానే అవసరం లేకుండానే నిధులు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఆరో వార్డు కౌన్సిలర్ గడ్డం రమేశ్ ఎజెండా పత్రాలను పడేసి అసహనంతో సమావేశం మద్యలోనే వెల్లిపోయారు.
ఇప్పటికే తన వార్డు పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకం, ప్రారంభోత్సవ బోర్డులను ఏర్పాటు చేయలేదని ఒకటో వార్డు కౌన్సిలర్ గౌరిశంకర్ ప్రశ్నించారు. ఆర్టీసీ బస్టాండ్, ఉప్పనుంతల మార్గంలోని కల్వర్టు పనుల్లో జాప్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రమాదకరమైన ఫోల్స్ తొలగించాలని కౌన్సిలర్ మనోహర్ ప్రసాద్ కమిషనర్ ను కోరారు. అలాగే 163 సర్వే నెంబర్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అనుమతులేకుండానే ఏర్పాటు చేసిన వెంచర్లలోని ప్లాట్ల రాళ్లు తొలగించాలని.. అక్కడ వ్యాపారులు ఇల్లీగల్ గా ప్లాట్లను విక్రయించి ప్రజలను మోసం చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. మున్సిపల్ అనుమతి లేకుండా పట్టణంలో ఎవరు ఫ్లెక్లీలు, జెండాలు ఏర్పాటు చేయకుండా చూడాలని పలువురు సభ్యులు కోరారు. వేసవిలో తాగునీటి సమస్యలేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
* త్వరలోనే టీయూఐడీఎప్ నిధులు: ఛైర్మన్
అచ్చంపేట మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ. 45 కోట్ల టీయూఐడీఎప్ నిధులు కేటాయించిందని ఛైర్మన్ శ్రీనివాసులు, కమిషన ర్ మురళి వెల్లడించారు. ఇప్పటికే రూ. 22 కోట్ల విలువైన పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. మరో రూ. 23 కోట్లు రావాల్సి ఉందని.. వాటితో పట్టణంలోని ప్రతీ వార్డుకు రూ. కోటి చొప్పునా నిధులు కేటాయించి పనులు చేపడుతామని చెప్పారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే పట్టాణాభివృద్ధి సాధ్యమన్నారు. వార్డుల పరిధిలోని సమస్యలను కౌన్సిలర్లు గుర్తించి తెలియజేస్తే.. వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఛైర్ ఫర్సన్ శైలజారెడ్డి, మేనేజర్ రమేశ్ నాయక్, ఏఈ రాజ్యానాయక్, కౌన్సిలర్లు రమేశ్ రావు, జి.శివ, లలిత, ఖాజబీ, కో ఆప్షన్ సభ్యడు రాములు తదితరులు పాల్గొన్నారు.




