కేసీఆర్‌పై ఈడీ కేసు.. ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు
13-06-2024 04:30 PM
హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసిందన్నారు. కేసీఆర్ కోసం కాసేపటి క్రితం ఈడీ అధికారులు వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. రూ. 500 కోట్లు ఖర్చుపెట్టినా వెంకట్రామిరెడ్డి గెలవలేదని రఘునందన్ వెల్లడించారు. మెదక్ మున్సిపాలిటీలోనూ బీజేపీ జెండా ఎగరాలని ఆయన ఆకాంక్షించారు. కేసీఆర్, హరీశ్ రావు, వెంకట్రామిరెడ్డికి ముందుంది మొసళ్ల పండగ అన్నారు.






