ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్.. 'సాయంత్రంలోగా చంపేస్తాం'..
23-06-2025 02:47 PM
హైదరాబాద్: బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు(BJP Medak MP Raghunandan Rao)కు పీపుల్స్ వార్ మావోయిస్టు(People's War Maoist) పేరుతో బెదరింపులు కాల్ వచ్చింది. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి హజరైన ఆయనకు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ ను పీఏ లిప్ట్ చేశాడంతో ఆగంతకుడు తాను మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టునంటూ.. సోమవారం సాయంత్రంలోకా రఘునందన్ రావును చంపుతామంటూ బెందింరించాడు. దీంతో ఎంపీ మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.






