15 April, 2026 | 7:12 AM

స్నేహితున్ని పరామర్శించిన ఎంపీ రవిచంద్ర

31-05-2025 06:33 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) స్నేహితుడు సత్తూరి యాదగిరి కుమారుడు అశోక్ ఇటీవల మరణించగా, శనివారం ఎంపీ రవిచంద్ర స్నేహితుడు యాదగిరిని పరామర్శించారు. ఎంపీ రవిచంద్ర తన సోదరులు వద్దిరాజు కిషన్, దేవేందర్ తో కలిసి తన స్వగ్రామం ఇనుగుర్తి లోని సన్నిహితుడు సత్తూరి యాదగిరి ఇంటికి వచ్చి, స్వర్గీయ అశోక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పుత్రశోకంతో బాధపడుతున్న స్నేహితుడు యాదగిరిని ఓదార్చారు.