28 July, 2026 | 10:08 AM

బిభవ్ విడుదలైతే నాకు ప్రాణహాని

28-05-2024 12:05 AM

బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలి..

 కోర్టులో ఎంపీ స్వాతిమలివాల్ కన్నీటి పర్యంతం

న్యూఢిలీ, మే 27: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్‌కు బెయిల్ వస్తే తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఎంపీ, ఆప్ నేత స్వాతిమలివాల్ కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. ఎంపీ స్వాతిపై దాడి చేశాడనే ఆరోపణలపై కొద్దిరోజుల క్రితం బిభవ్‌కుమార్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సోమవారం ఢిల్లీ కోర్టు ఈ కేసును విచారించగా హైడ్రామా సాగింది.  సీఎంని కలిసేందుకు స్వాతిని ఎవరూ ఆహ్వానించలేదని, సీఎం నివాసంలోకి చొరబడేందుకు యత్నించినందుకు ముందుగా ఆమెను విచారించాలని బిభవ్‌కుమార్ తరఫు న్యాయవాది వాదించారు. ఇలా విచారణ సాగుతుండగా స్వాతి కన్నీటి పర్యంతమయ్యారు. బిభవ్‌కుమార్ సాధారణ వ్యక్తి కాదు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రులకు ఉండే పవర్స్ అతనికి ఉన్నాయి. ఆయన బయటకు వస్తే నాకు ప్రమాదం అని వాపోయారు.