24 June, 2026 | 2:31 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

గోలిలింగాలలో ఇందిరమ్మ ఇళ్ల పనులు పురోగతినీ పరిశీలించిన ఎంపీడీవో

02-05-2026 07:48 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోలిలింగాల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు చేయబడగా, ప్రస్తుతం ఎక్కువ ఇళ్లు నిర్మాణ దశల్లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నాణ్యతతో పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ సూచించారు.

లబ్ధిదారులు కూడా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు.అవసరమైన సాంకేతిక సహాయం, మార్గదర్శకాలు అందించడానికి అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి నివాసం ఉంటుండగా,మిగిలిన ఇళ్ల పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామ సర్పంచ్ బుర్రకల రోజా బాబు,కార్యదర్శి సంతోష్ కుమార్,లబ్ధిదారులు పాల్గొన్నారు.