2 May, 2026 | 8:51 PM

Breaking News

అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •  

విద్యార్థులను అభినందించిన మంత్రి అడ్లూరి

02-05-2026 07:46 PM

ప్రభుత్వ పాఠశాలల ఫలితాలపై హర్షం వ్యక్తం

ధర్మపురి,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఎండపల్లి మండలంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన సహర్షిత, సంజన, రేఖలను తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ మంత్రి అడ్లూర్రి లక్ష్మణ్ కుమార్ శనివారం అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలనీ ఆయన ఆకాంక్షించారు.ప్రభుత్వ పాఠశాలల ఫలితాలపై ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ విద్యార్థులను అభినంధించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థుల తల్లిదoడ్రులను జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా అభినందించారు.