28 February, 2026 | 10:53 PM

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

28-02-2026 09:00 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తాడ్వాయి ఇన్చార్జి ఎంపీడీవో సవిత రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు నిర్వహిస్తున్న సైన్స్ పేర్ ను పరిశీలించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను చూసి ప్రయోగాలు ఎలా తయారు చేశారు, వీటి ఉపయోగాలు ఎలా ఉంటాయి అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.