ప్రభుత్వం టైలర్లను ఆదుకోవాలి
28-02-2026 08:57 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): ప్రభుత్వం టైలర్లను ఆదుకోవాలని తాడ్వాయి మండలం టైలర్ల సంఘం అధ్యక్షులు దశరథ్ కోరారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం టైలర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయట రెడీమేడ్ దుస్తులు, గార్మెంట్స్ రావడంతో టైలర్లకు పని తగ్గిందని ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ట్రైలర్లను ఆదుకోవడానికి ప్రత్యేక పథకం రూపొందించాలని కోరారు. మండలం టైలర్ల ను గుర్తించి కుట్టు మిషన్లు ఉచితంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి భాస్కర్, సలహాదారుడు గంగా కుమార్ తదితరులు పాల్గొన్నారు




