27 June, 2026 | 2:41 AM

ఘనంగా మొహర్రం వేడుకలు

27-06-2026 01:37 AM

మేడ్చల్ అర్బన్ జూన్ 26 (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘనంగా మొహర్రం పండుగ వేడుకలను నిర్వహించారు. మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో మొహర్రం పండుగ సందర్భంగా 10 రోజుల పండుగను ఇమామ్ ఈ ఖాసిం అశుర్ఖాన మేనేజింగ్ కమిటీ అధ్యక్షులు ఖాజా ఖాళీలుద్దీన్ ఆధ్వర్యంలో అన్నదానము శరబత్ పంపిణీ చేశారు. అనంతరం పీర్లను మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్.కమిటీ సభ్యులు లాయక్ అలీ.రఫీక్.ఎండి హుస్సేన్ ఖురేషి.బద్రుద్ధీన్.ఖాజా మోహినిద్దీన్.ఎంఎ ముక్తార్.మహమ్మద్ జమాల్.మాజి కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ.మాజి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎండీ అలీ అబ్రార్.ఇనాయత్ అలీ.నాసిర్.తోకిర్.రమణ.తదితరులు పాల్గొన్నారు...