calender_icon.png 25 September, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలేరులో ముక్తార్ పాషన్న వర్ధంతి సభ

25-09-2025 12:00:00 AM

ఆలేరు, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి) ఆలేరు పట్టణంలో గల సిపిఐ (ఎంఎల్) పార్టీ ఆఫీసులో కామ్రేడ్ ముక్తార్ పాషన్న అయిదవ వర్ధంతి జరిగింది కామ్రేడ్ ముక్తార్ పాష సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యునిగా, ఐ ఎఫ్ టి యు అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ప్రజలు, రైతు, కూలీలు, కార్మిక వర్గం, ఇతర వర్గాల ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా పాలక వర్గం అనుస రిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను,

ప్రజల ను విభజించి పాలించే దగాకోరు, నీతి మాలిన చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేక ప్రజా,కార్మిక వర్గ పోరాటాలను ఎనలేని కృషి చేశాడని సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్. జనార్ధన్ కొనియాడారు.  ఈ కార్యక్రమంలో ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర అద్యక్షులు ఎం. భిక్షపతి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్ష,

ప్రధాన కార్యదర్శులు పద్మ సుదర్శన్,గడ్డం నాగరాజు, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చిర బోయిన రాజయ్య, పిన్నపు రెడ్డి రాఘవరెడ్డి, అయిల యాకయ్య, మామిడాల భాను, చిర బోయిన కొమురయ్య, భూసే శ్రీశైలం, బర్మ బాబు, ఇక్కిరి శ్రీనివాస్, ఊరడి రామ చంద్రు, మామిడాల మధు, ఓరుగంటి మైసయ్య, కాండ్రాజు రమేష్  పాల్గొన్నారు.