calender_icon.png 25 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిండికేట్ లొల్లి

25-09-2025 12:00:00 AM

  1. వ్యాపారుల వాటాల పంచాయితీ
  2. సెటిల్మెంట్ల కోసం ఎక్సైజ్ కార్యాలయం ఎంట్రీ
  3. వ్యాపారుల మధ్య  మధ్యవర్తిగా సీఐ
  4. పరిష్కారం కోసం కంచనపల్లి వైన్స్ మూసివేసిన వ్యాపారులు

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 24: సిండికేట్ వ్యాపారస్తుల వాటాల పంచాయతీతో  వైన్స్ నే మూసేశారు. వీరి మధ్య సెటిల్మెంట్ సెటిల్మెంట్ కోసం మధ్యవర్తిగా సిఐ రంగంలోకి దిగారు. ఎక్సైజ్ కార్యాలయంలోనే  మద్యం వ్యాపారుల వాటాల పంచాయతీ కొనసాగింది. ఈ తతంగం  బుధవారం జిల్లా కేంద్రంలో జరిగింది. ల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సీఐ కార్యాలయం సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది.

మద్యం వ్యాపారుల మధ్య తలెత్తిన విభేదాలను స్వయంగా ఎక్సైజ్ సీఐ ప్రసాద్ ముందు పరిష్కరించుకునేందుకు  వైన్స్ సిండికేట్ వ్యాపారులు ఎక్సైజ్ కార్యాలయము లో సిఐ ప్రసాద్ ఎదుట సమావేశం అయ్యారు. సోషల్ మీడియాలో సీఐ ఎదుట వ్యాపారులు సమావేశమైన దృశ్యాలు వైరల్ కావడంతో ఈ విషయం సంచలనంగా మారింది. నల్లగొండ మండలంలోని కంచనపల్లి వద్ద ఉన్న షాప్ నెంబర్ 26, శ్రీ వెంకటేశ్వర వైన్స్ నిర్వాహకులు సిండికేట్ వ్యాపారంలో వ్యాపారుల మధ్య తలెత్తిన. వివాదాలతో షాపును మూసివేశారు.

వైన్స్ షాప్ ల గడువు మరి కొద్దిరోజుల్లో ముగుస్తుండడంతో ఇన్నాళ్లు సిండికేట్ గా ఏర్పడి చేసిన వ్యాపారంలో లాభనష్టాలను సరిచూసుకునేందుకు వైన్స్ వ్యాపారస్తులు సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో వ్యాపారుల మధ్య పంపకాలలో తేడాలు రావడంతో ఆగ్రహించిన శ్రీ వెంకటేశ్వర వైన్స్ యజమాని లెక్కలు తేలేంతవరకు తన దుకాణాన్ని తీయనని స్పష్టంగా చెప్పి దుకాణాన్ని మూసివేశాడు.

దీంతో సమస్య పరిష్కరించాలని సిండికేట్ వ్యాపారులు సిఐ ప్రసాదును ఆశ్రయించినట్లు కొంతమంది వైన్స్ వ్యాపారులు చెప్పారు. వైన్స్ వ్యాపారులు పంచాయతీ పరిష్కారం కోసం తనను ఆశ్రయించడంతో సిండికేట్ వ్యాపారుల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలను తొలగించేందుకు సిఐ ప్రసాద్ ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నల్లగొండ మండలంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించడంతో మద్యం వ్యాపారులకు లక్షల రూపాయల అదనపు సంపాదన వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం వ్యాపారుల అక్రమాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ సీఐ తన ఉద్యోగ బాధ్యతలను మరచి వ్యాపారుల మధ్య  స్టేషన్ ఆవరణలోనే సెటిల్మెంట్లకు ప్రయత్నించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి .

శ్రీ వెంకటేశ్వర వైన్స్ కు పెనాల్టీ వేస్తాం 

మద్యం వ్యాపారుల మధ్య సయోధ్య కుదిరిచ్చేందుకు తాను ప్రయత్నించానని వస్తున్న ఆరోపణలను నల్లగొండ ఎక్సైజ్ సీఐ ప్రసాద్ ఖండించారు. శ్రీ వెంకటేశ్వర వైన్స్ నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ దుకాణాన్ని మూసివేశాడని చెప్పారు. అలా చెప్పా పెట్టకుండా దుకాణాన్ని మూసివేయడం ఎక్సైజ్ నిబంధనల ప్రకారం నేరమని చెప్పారు.

ఎంత చెప్పినా మూసివేసిన దుకాణాన్ని తెరిచేందుకు యజమాని అంగీకరించక పోవడంతో శ్రీ వెంకటేశ్వర వైన్స్ పై పెనాల్టీ వేసేందుకు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఎక్సైజ్ కమిషనర్ కు రిపోర్టును పంపించినట్లు ఆయన తెలిపారు.