15 June, 2026 | 10:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అన్ని సమస్యలు పరిష్కరిస్తాం

25-02-2026 09:16 PM

- పదో వార్డు పర్యటనలో మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ చందన రవీందర్ బుధవారం పర్యటించారు. వార్డులోని పలు వీధులను సందర్శించి స్థానిక పరిస్థితులను, పారిశుధ్య పనులను వారు స్వయంగా పరిశీలించారు. వార్డు పర్యటనలో భాగంగా 10వ వార్డు కౌన్సిలర్ కోట బాబు రాజు వార్డులో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ కాలువలు, సి.సి. రోడ్లు, వీధి దీపాల సమస్యలను చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని విన్నవించారు. విన్నపాలపై సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్ చందన రవీందర్ మాట్లాడుతూ. వార్డుల అభివృద్ధికి తమ పాలకవర్గం కట్టుబడి ఉందని, ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి తమ వార్డుకు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని, కౌన్సిలర్ కోట బాబు, వార్డు ప్రజలు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.