Vikasit Bharat Youth Parliament 2026 Program
విద్యార్థులు రిల్స్ పై కాదు చదువుపై దృష్టి పెట్టాలి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు యూనివర్సిటీ: విద్యార్థులు రీల్స్ పై దృష్టి పెట్టకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2026 కార్యక్రమానికి ఎమ్మెల్యే మాట్లాడారు. యూనివర్సిటీలో స్కూల్లో, కాలేజీలో మనం అలవర్చుకునే అవకాశం ఉంటుందని, మీరు అనుకున్న ఆలోచన స్పష్టంగా ఎక్స్ ప్రెస్ చేయాలన్నారు. బేసిక్ లెవెల్ జాబ్స్ అంతా కూడా కంప్యూటర్లో ఉంటుందని, మీరు అప్డేట్ లేకుంటే మీరు ప్రపంచం తోటి కనెక్ట్ లేకుంటే మీరు మీ కెరియర్ మీద ఇంట్రెస్ట్ లేకుంటే, చదువు టైం పాస్ అనుకుంటే కచ్చితంగా వెనుకపడతారన్నారు.
అందుకే మీరు పీజీ చేయండి డాక్టరేట్ చేయండి ఏమైనా చేయండి కానీ మీరు వరల్డ్ తో కనెక్ట్ లేకుండా బయట ఏం జరుగుతుందో మీకు తెలియకుండా ఉంటే మీరు ఎటువంటి స్కిల్స్ చేయాలి అనుకుంటే చేయలేరని తెలిపారు. దయచేసి మా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ని,ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ కచ్చితంగా ప్రతినెల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే మంచిన్నారు. గ్రామీణ పట్టణం నుంచి వచ్చేవాళ్ళు అకాడమిక్ లో ఎన్ని తెలివితేటలు ఉన్న ,ట్రైనింగ్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారని పేర్కొన్నారు.
ఎక్కడ కాంపిటీషన్ ఉంటే అక్కడ మన పిల్లల్ని పంపియ్యాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే చెప్పారు. క్విజ్, ఎలక్ట్రీషియన్, స్పోర్ట్స్ ఏది ఉన్నా సరే మనం వెనకాల ముందుకు చూడకుండా వెళ్లాలి అని ఎమ్మెల్యే విద్యార్థులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ శ్రీనివాస్,ప్రిన్సిపాల్ కరుణాకర్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషనర్ డాక్టర్. ప్రవీణ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్ధారం సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్ ప్రశాంత్, ఏసుదాస్, తదితరులు పాల్గొన్నారు.




