06-02-2026 01:42:01 AM
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మెదక్ జిల్లా రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
రామాయంపేట, ఫిబ్రవరి 5: దేశంలో, రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని కేంద్రమం త్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఉద్యమకారులను తెలంగాణ ప్రజలను వంచించి మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఏనాడు అవినీతికి పాల్పడదని, తమ అభ్యర్థులు సైతం ప్రజాసేవ కోసం అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిపారు.
ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొ న్నారు. బిజెపి తరఫున ధనవంతులు కానీ అవినీతిపరులు కానీ పోటీలో ఉండరని కేవలం నిరుపేదలు సమాజానికి సేవ చే యాలనే సంకల్పంతో ఉన్నవారు మాత్రమే పోటీ లో ఉంటారని అటువంటి వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో ప్రజలను మోసం చేయ డం, దాచుకోవడం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెల్లుతుందని మెదక్ ఎంపీ రఘునంద న్‌రావు అన్నారు.
కేంద్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నప్పుడు బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఆస్తులు కూడగట్టుకోవడమే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రాణ త్యాగం చేసిన అమరులను పూర్తిగా మర్చిపోయి కేవలం తమ కుటుంబీకులకు, వారి పాట పాడే వారికి మాత్రమే రాజకీయంగా ఎదగనిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బిజెపితోనే సాధ్యమవుతుందన్నారు.