calender_icon.png 12 August, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునీర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

12-08-2025 01:40:43 AM

  1. పాక్ అణ్వాయుధ దేశం అంటూ అమెరికాలో వ్యాఖ్యానించిన మునీర్
  2. సగం ప్రపంచాన్ని పతనం వైపు తీసుకెళ్తామంటూ ప్రేలాపనలు

న్యూఢిల్లీ, ఆగస్టు 11: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ సోమవారం స్పందించింది. ‘పాకిస్థాన్ అణ్వాయుధ కత్తు లు ఊపుతోందనేందుకు ఇదే ఉదాహరణ. అణ్వాయుధాలతో బెదిరించడం పాక్‌కు అలవాటే.

ఇటువంటి ప్రకటనలు ఎంత బా ధ్యతారహితంగా ఉన్నాయో అంతర్జాతీయ సమాజం చూస్తోంది. ఉగ్రవాద సంస్థలతో సైన్యం కుమ్మక్కైన దేశాన్ని అణ్వాయుధాల నియంత్రణ, బాధ్యతతో విశ్వసించలేమనే అనుమానాలకు ఈ ప్రకటనలు మరింత బ లం చేకూరుస్తున్నాయి’ అని ఎంఈఏ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా గడ్డ మీద నుం చి ఒక దేశానికి చెందిన వ్యక్తి మరో దేశానికి అణుబెదిరింపులు చేయడం ఇదే తొలిసారి. 

మునీర్ వ్యాఖ్యలివే.. 

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఫ్లోరిడాలో ఉన్న పాకిస్థానీ ప్రవాసీయులతో మా ట్లాడుతూ.. పాకిస్థాన్ అణ్వస్త్ర సామర్థ్య దేశం అని, ఒక వేళ భవిష్యత్‌లో భారత్ నుంచి పాక్ అస్థిత్వానికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్నారు.  భారత్ ఒక వేళ సింధు నదిపై ఆనకట్ట నిర్మిస్తే క్షిపణులతో దాడి చేసి కూల్చేస్తామని వ్యా ఖ్యానించారు. సింధు నది భారతీయుల కు టుంబ ఆస్తి కాదన్నారు.