12-08-2025 01:41:45 AM
నియామకాలపై కన్నెర్ర చేసిన సుప్రీం
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆర్మీ నియామకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ బ్రాంచి పోస్టుల్లో నియామకాల కోసం అనుసరిస్తున్న 2:1 నిష్పతి విధానం సరికాదంది. ఆ విధానం అమలు చేయకూడదని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం తేల్చి చెప్పింది. మహిళలపై పరిమితి పెట్టి ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్ చేయకూడదని స్పష్టం చేసింది.
లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగీ అనే మహిళలు ర్యాంకులు సాధించినా కానీ పోస్టింగ్స్ ఇవ్వకపోవడంతో వారు సుప్రీంను ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై గతంలోనే విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది