calender_icon.png 12 August, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీకి జెలెన్‌స్కీ ఫోన్

12-08-2025 01:39:01 AM

రష్యాకు ఎగుమతులు పరిమితం చేయాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఉక్రెయిన్ అధ్యక్షు డు జెలెన్‌స్కీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలపై రష్యా చేస్తున్న భీకర దా డుల గురించి ఆయన వివరించారు. ఇరువురు నేతల ఫోన్ సంభాషణ గురించి ప్రధా ని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.  ‘ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడటం ఆనందంగా ఉంది. ఆ దేశానికి సంబంధించి ఇటీవలి పరిణామాలపై జెలెన్‌స్కీతో మా ట్లాడి జెలెన్‌స్కీ అభిప్రాయాలు తెలుసుకున్నా.

ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా, శాం తియుతంగా పరిష్కరించడంపై భారత్ స్థిర వైఖరిని తెలియజేశాను. యుద్ధం ముగింపులో వీలైన సహకారం అందించేందుకు, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కొరకు భారత్ కట్టుబడి ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ఇటీవలే భారత ప్రధాని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా ఫోన్‌లో సంభాషించారు.

‘ఉక్రెయిన్ పౌరులకు మద్దతుగా మాట్లాడిన భారత ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మా గ్రామాలు, నగరాలే లక్ష్యం గా రష్యా చేస్తున్న భీకర దాడుల గురించి ఆయనకు తెలిపా. ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషం’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎక్స్‌లో పేర్కొన్నారు.