calender_icon.png 3 June, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదినం

01-06-2025 12:30:35 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.నారాయణపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కరంటోతు శ్రీను ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆపద ఉందంటే అరక్షణం కూడా ఆలోచించని నిజమైన నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

మునుగోడు నియోజకవర్గ(Munugode Assembly constituency) అభివృద్ధి కోసం,పేద ప్రజల శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యేకు రాబోయే మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. మునుగోడు ప్రతీ ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గుత్త ఉమాదేవి ప్రేమ్ చందర్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ బుజ్జి,భానుమతి వెంకటేష్, పీఏసిఎస్ ఛైర్మెన్ జక్కిడి జంగారెడ్డి, చిమిర్యాల మాజీ సర్పంచ్ దోనూరి జైపాల్ రెడ్డి ,నాయకులు ఉప్పల లింగస్వామి,ఎపూరి సతీష్,మందుగుల బాలకృష్ణ,అక్బర్ అలీ, కోన్రెడ్డి నరసింహ, చంద్రారెడ్డి,జక్కలి ఐలయ్య,రహీమ్ షరీఫ్,కత్తుల లక్ష్మయ్య,సింగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.