01-06-2025 12:34:10 PM
తుంగతుర్తి, విజయక్రాంతి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి(Thungathurthy) మండల కేంద్రంలో భువనగిరి మాజీ ఎంపీ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) జన్మదిన వేడుకలను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రామాలయం చైర్మన్ ఎనగందుల సంజీవ, కాంగ్రెస్ నాయకులు కటకం సూరయ్య, బత్తుల జలంధర్, వీరబోయిన రాములు, అంబటి రాములు, మైనార్టీ సెల్ నాయకులు ఎండి.అబ్దుల్ షేక్ కరీం, మల్లెపాక సుమన్, మరికంటి అశోక్, బొంకూరి నాగయ్య, మంగళపల్లి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.