calender_icon.png 4 September, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు చిన్నారుల హత్య.!

04-09-2025 01:10:06 PM

మూడవ బాలిక ఆచూకే కోసం కొనసాగుతున్న గాలింపు.             

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): ప్రకాశం జిల్లాకు చెందిన గుప్త వెంకటేశ్వర్లు అనే తండ్రి తన ముగ్గురు పిల్లలతో కలిసి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దారుణమైన మలుపు తీసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన దారుణంగా మారింది. వివరాల్లోకి వెళితే, వెంకటేశ్వర్లు తన భార్యతో గొడవపడి, ముగ్గురు పిల్లలను తీసుకుని బైక్‌పై నాగర్ కర్నూల్ జిల్లాలో వెల్డండ ప్రాంతానికి వచ్చి పురుగు మంది సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన వెల్డండ పోలీసులు(Veldanda Police), గురువారం ఉప్పునుంతల మండలంలోని వెల్టూరు గ్రామ సమీప గుట్టల్లో  ఇద్దరు చిన్నారుల మృతదేహలను గుర్తించారు. ఈ సందర్భంగా, వెంకటేశ్వర్లు తన కుమారుడు శివధర్మ (4), కుమార్తె రఘు వర్షిణి (6)లను హత్య చేసి, వారి మృతదేహాలకు పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనా స్థలంలో సీఐ విష్ణువర్ధన్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా, పెద్ద కుమార్తె మోక్షిత (8) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఆమె కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్, స్థానికుల సహకారంతో గుట్టల ప్రాంతాల్లో శోధన కొనసాగుతోంది. ఇక ఈ ఘటనతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎలాగైనా మోక్షిత క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నాం.  అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగంతో చెప్పారు.