calender_icon.png 4 September, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితను మా పార్టీలోకి తీసుకోం: రామచందర్ రావు

04-09-2025 01:07:10 PM

మోదీతో పాటు ఆయన తల్లిని కూడా కాంగ్రెస్ వదట్లేదు

హైదరాబాద్: నిత్యావసరాల ధరలు చాలా వరకు దిగి వచ్చాయని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(BJP state president Ramachandra Rao) గురువారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తోందని చెప్పారు. మోదీతో పాటు ఆయన తల్లిని కూడా కాంగ్రెస్ వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యతరగతి ప్రజలు వాడే వస్తువుల ధరలు తగ్గాయని తెలిపారు. జీఎస్టీ తగ్గించి అన్ని వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చిందని వెల్లడించారు. రేపు ప్రధాని మోదీకి పాలాభిషేకం చేయాలని రామచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 2025లో బుధవారం 10 గంటలకు పైగా కొనసాగిన 56వ సమావేశంలో వస్తు సేవల పన్ను (Goods and Services Tax) కౌన్సిల్, ఎనిమిదేళ్ల నాటి పరోక్ష పన్ను విధానంలో తదుపరి తరం సంస్కరణలను ఆమోదించింది. ప్రెస్ మీట్ కవిత రాజీనామాపై మీడియా ప్రతినిధుల ప్రశ్నపై స్పందించిన ఆయన ఈ అంశాన్ని తాను లైట్ గా తీసుకున్నానని చెప్పారు. కవితను పార్టీలోకి తీసుకోమని తేల్చిచెప్పిన ఆయన అవినీతిపరులకు బీజేపీలో స్థానం లేదని చెప్పారు. కవిత గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని రాంచందర్‌రావు స్పష్టం చేశారు.