6 July, 2026 | 9:23 PM

Breaking News

ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •  

మూసలు

07-04-2025 12:00 AM

కాలాన్ని మూసల్లో పోసి

అచ్చులు తీస్తున్నా

అన్నీ నా ముఖాలే! 

మూసల్ని తయారు చేసిందెవరు?

తయారైన బొమ్మలన్నీ నావే!!

మూసల్ని ధ్వంసం చేసి

కొత్త  అచ్చుల్ని తీద్దామంటే 

మనసు రాసుకున్న ఉహలే 

మూసలవుతున్నాయి!

పారదర్శకత్వం 

ఋషిత్వం మాటకెందుకులే

దేహానికి కొత్తగా

స్వభావాలకు మించి

చెప్పేదేముంది?

సత్యాల్ని గిరాటేసి 

మనిషి తన జీవితాన్ని తానే

రాసుకుంటున్నాడు!

సత్యాలుంటాయి

మూసల్లో మన ముఖాల్నే

రాసుకుంటాం!!

- తంగళ్లపల్లి కనకాచారి