07-04-2025 12:00:00 AM
‘వురిమళ్ల ఫౌండేషన్’ 7వ వార్షికోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికిగాను జాతీయ స్థాయి లో కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నారు. వురిమళ్ల శ్రీరాములు స్మారక కథల పోటీలో ఎంపికైన వారికి ప్రథ మ బహుమతి 5000/ ద్వితీయ బహుమతి 4000/ బహుమతి 3000/ తో పాటు రెండు కన్సొలేషన్ బహుమతులు 1000/ -చొప్పున విజేతలకు ఇస్తారు. ‘వురిమళ్ల పద్మజ’ స్మారక కవితల పోటీలో ఎంపి కైన వారికి ప్రథమ బహుమతి 4000/ ద్వితీయ బహుమతి 3000/ తృతీయ బహుమతి 2000/ తోపాటు రెండు కన్సొలేషన్ బహుమతులు 1000/ చొప్పున విజేతలకు అందిస్తారు. వీటితోపాటు ఉమ్మ డి ఖమ్మం జిల్లాలో సాహిత్యరంగంలో విశేష కృషి చేస్తున్న ఒకరికి ‘భోగోజు పురుషోత్తం -సముద్రమ్మ’ల సాహితీ పురస్కారం, రూ 10,000/ -నగదు బహుమ తి అందిస్తారు. కథలు, కవితలు చేరడానికి చివరి తేదీ: 30 ఏప్రిల్ 2025. చిరునామా: భోగోజు ఉపేందర్‌రావు, ఇ.నెం.11-- బురహాన పురం, ఖమ్మం టౌన్ ్ల సెల్: 9494773969.
- వురిమళ్ల సునంద ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు
సాహితీ అవార్డులు
‘ఈశ్వరగారి ముక్తేశ్వరి ఫౌండేషన్’ 2024 లో ప్రచురితమైన కథా సంపుటాలు, వ్యాస సంపుటాలు, కవితా సంపుటాలు, ఆధ్యాత్మిక సంపుటాలకు చెందిన రచయితల నుంచి సాహితీ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఒక్కో విభాగానికి రూ.10,116/- నగదు పారితోషికం సహా జ్ఞాపికను అందిస్తారు. వేములవాడలోని ము క్తేశ్వరి ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో రచయితలకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మూడేసి ప్రతుల చొప్పున రచనలు చేరడానికి చివరి తేదీ: 25.5.2025.
చిరునామా: ఈశ్వరగారి నరహరిశర్మ, చైర్మన్, ఈశ్వరగారి ముక్తేశ్వరి ఫౌండేషన్, ఓల్డ్ మార్కెట్, వేములవాడ 505302, -రాజన్న సిరిసిల్లా జిల్లా, తెలంగాణ. సెల్: 9396648880.
‘సంతోషాల గాలిపటం’ ఆవిష్కరణ
తెలంగాణ, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘అమరవాది ఫౌండేషన్’ సాహి త్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ నిర్వహణలో శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల రచిం చిన బాలల కథలు ‘సంతోషాల గాలిపటం’ పుస్తకావిష్కరణ హైదరాబాద్, రవీంద్రభారతి సమావేశ మందిరంలో 11న సాయంత్రం జరగనుంది. పిల్లలు, పెద్దలు, సాహిత్యాభిమానులు అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా రచయిత్రి ఒక ప్రకటనలో కోరారు.
కొత్త పుస్తకం
శూన్యం (కవిత్వం) ఫిజిక్స్ అరుణ్‌కుమార్
పేజీలు: 144, వెల: రూ.220/ ప్రచురణ: జె.ఎస్.ప్రచురణలు
ప్రతులకు: కవి చిరునామా-:
పి.అరుణ్‌కుమార్, s/o సుబ్బయ్య
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ 509209
సెల్: 9394749536