6 July, 2026 | 10:00 PM

ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం

06-07-2026 09:21 PM

15వ వార్డులో ఇంటింటికీ చేరిన అవగాహన

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలోని 15వ వార్డులో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సోమవారం ముమ్మరంగా కొనసాగింది. అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇమామ్ ఏ షఫీ మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు.

ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వార్డులోని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, అవసరమైన పత్రాలపై మార్గనిర్దేశం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సంబంధిత అధికారులను లేదా స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రఫీ బిఎల్వోలు ధనలక్ష్మి, అనంతలక్ష్మి, భవాని, కవిత, జిపిఓ ల,క్ష్మీ అన్వర్ తదితరులు పాల్గొన్నారు