25-05-2025 04:07:06 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఇచ్చిన పిలుపు మేరకు మైనార్టీలు ఆదివారం నల్గొండలో మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. వక్ఫ్ బచావో, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, హిందూ ముస్లిం భాయ్ భాయ్, భారత్ జిందాబాద్ అంటూ జాతీయ జెండాని గౌరవిస్తూ నిరసన వ్యక్త పరిచారు. మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపై వచ్చి మానవహారాన్ని శాంతియుతంగా ముగించారు. సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.