-..మగవాడినే అనుసరించాలి
శ్రీవిష్ణు, రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా ‘శ్వాగ్’. హసిత్ గోలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రేజర్ టీజర్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ‘వంశాలైనా, ఆస్తులైనా, ఆడవాళ్లయినా మగవాడినే అనుసరించాలి’ అంటూ హీరో శ్రీవిష్ణు మగవారి గురించి స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇవ్వటంతో ఈ వీడియో ప్రారంభమయింది.
‘భవభూతి’ అనే పురుష అహంకారి పాత్రలో నటిస్తున్న ఆయన ఈ వీడియోలో భయంకరమైన మేకోవర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమాలో రీతూవర్మ వింజామర వంశానికి చెందిన యువరాణి రుక్మిణీదేవిగా నటిస్తోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ స్వరాలు సమకూరుస్తుండగా, భువనచంద్ర, రామజోగయ్యశాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేశ్, సుంకోజి, స్వరూప్ గోలి పాటల సాహిత్యాన్ని అందిస్తున్నారు. సహ నిర్మాత: వివేక్ కూచిబొట్లు; సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్.






