calender_icon.png 6 December, 2024 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ గణనాథుని ఆశీర్వాదాలతో విద్యార్థులు చదువులో రాణించాలి

16-09-2024 10:29:17 AM

ముత్తారం ఎస్ఐ నరేష్

ముత్తారం (విజయక్రాంతి): ఆ గణనాథుని ఆశీర్వాదాలతో విద్యార్థులు చదువులో రాణించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ముత్తారం ఎస్ఐ నరేష్ అన్నారు. సోమవారం ఉదయం ముత్తారంలోని గణనాథున్ని ఎస్ఐ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన భగీరథ రాము ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు ఎస్ఐ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గట్టయ్య, చేరాలు, రాజేందర్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.