20వ వార్డు అభివృద్ధే నా ధ్యేయం
వనపర్తిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీల్ వాల్మీకి
వనపర్తి, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా వనపర్తి 20వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిది ద్దడమే తన లక్ష్యమని బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావు పల్లె సునీల్ వాల్మీకి పేర్కొన్నారు. ఆదివారం 20వ వార్డులో స్థా నిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కా రు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. పదవులు ఉన్నా లేకున్నా గతంలో అనేక సే వా కార్యక్రమాలు నిర్వహించామని, ఇప్పు డు అధికారికంగా మరిన్ని సేవలు అందించేందుకు మీ ముందుకు వస్తున్నానని ఆయ న తెలిపారు.
వార్డు ప్రజలకు ఏ కష్టం వచ్చి నా తాను అందుబాటులో ఉంటానన్నారు. వార్డు అభివృద్ధి లో చురుకైన పాత్ర పోషిస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమ లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీతోనే ప్రగతి సాధ్యం అని, కారు గుర్తుపై గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విన్నవించారు. వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.






