21 March, 2026 | 3:28 PM

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మైనంపల్లి సర్పంచ్

21-03-2026 01:57 PM

దేవరకొండ,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ శనివారం దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు బ్రిడ్జితాండ మూడవత్ కవిత మరియు రామవత్ రజిత ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న సందర్భంగా  సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఎమ్మెల్యే బాలునాయక్ సహకారంతో మంజూరైన ఇండ్లను త్వరగా నిర్మాణం చేసుకోవడం వల్ల పేదలు సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అనునిత్యం ప్రజల శ్రేయస్ కొరకు పనిచేస్తుందని అన్నాడు  ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాసారం అంబెడ్కర్. వార్డు సభ్యులు మూడవత్ దాసు నాయక్.కొర్ర కిషన్. కొర్ర సునీత బద్దు. కొర్ర లక్ష్మీ ప్రశాంత్. గ్రామస్తులు పాండు. బిచ్య. చిన్య. నరహరి తదితరులు పాల్గొన్నారు