21 March, 2026 | 9:59 PM

ఘనంగా రంజాన్ వేడుకలు..

21-03-2026 01:58 PM

ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు

పాపన్నపేట,మార్చి21: పాపన్నపేట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో శనివారం రంజాన్(Ramadan celebration) పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షల అనంతరం శనివారం పండుగను ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ముస్లిం పెద్దలు, ఆయా పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.