హమాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాగన్న
01-06-2026 01:36 AM
మహబూబాబాద్, మే 31 (విజయక్రాం తి): సీఐటీయూ అనుబంధ ఆల్ హమాలీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మహబూబాబాద్ కు చెందిన కుమ్మరికుంట్ల నాగన్న ఎన్నికయ్యారు. జనగామ జిల్లాలో ఈ నెల 30 న ఆల్ హమాలీ సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించగా, ఈ మహాసభ అనంతరం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కమిటీ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మహబూబాబాద్ నుండి సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.






