1 June, 2026 | 2:19 AM

నిషేధిత నల్లబెల్లం పటిక పట్టివేత

01-06-2026 01:37 AM

తొర్రూరు, మే 31 (విజయక్రాంతి): తొర్రూరు పాల కేంద్రం దగ్గర పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా  తిరుమలగిరి నుండి తొర్రూర్ వస్తున్న కారును  నడుపుతున్న డ్రైవరు పోలీసులను చూసి తడ బడుతూ తన కారు ను రోడ్డు పక్కకు ఆపి పారిపోతుండగా, అతన్ని పట్టుకొని కారులో సోదాలు నిర్వహించారు.  నల్ల బెల్లం, పటిక కర్ణాటక స్టేట్ లోని బీదర్ దగ్గర కొని తాను డోర్నకల్ గ్రామ చుట్టూ పక్కల వున్న తాం డాలలో ఎక్కువ ధరకు అమ్ముటానికి వెళుతున్నట్టు గుర్తించారు. కారులో ఉన్న 8.50 క్వింటాళ్ల నల్ల బెల్లం, 50 కేజీల పటికను స్వాధీనం చేసుకుని, జాకర్ గణపత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తొర్రూరు ఎస్ ఐ మహేందర్ రెడ్డి  తెలిపారు.