యూకే పీహెచ్‌వోఎల్ సభ్యునిగా నాగరాజు
29-07-2026 12:28 AM
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): బ్రిటన్‌లో యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ (పీహెచ్‌వోఎల్) సభ్యునిగా తెలంగాణకు చెందిన లార్డ్ ఉదయ్ నాగరాజు ఎన్నిక కావడం పట్ల కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని ఇండియా హాబిటెట్‌లో జరిగిన కార్యక్రమంలో నాగరాజును సన్మానించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి యూకేలో పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.






